గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారం జీ5 తో కలిసి ఒక వెబ్ సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సేరీస్ కి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి 'మిషన్ తషాఫీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.
తాజాగా ఇప్పుడు, టాలీవుడ్‌లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తిరువీర్ ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ లో కీలక ప్రాతలో కనిపించనున్నట్లు సమాచారం. నటుడి పుట్టినరోజు సందర్భంగా ZEE5 మిషన్ తషాఫీ లో తిరువీర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగులో ఇదే తొలి స్పై థ్రిల్లర్ సిరీస్.
ఈ సిరీస్ యొక్క రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సిరీస్ లో సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగర్, అనీష్ కురువిల్లా చత్రపతి శేఖర్, భూషణ్ కళ్యాణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిలిం రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతిరెడ్డి ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa