విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన సినిమా 'లాల్ సలాం'. ఈ సినిమాకి ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో సూపర్ స్టార్ ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించిన ఒక ఫోటోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ సినిమాలో జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటిస్తున్నారు.ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa