తమిళ సూపర్‌స్టార్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ హీరోగా ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘రఘువరన్ బీటెక్’. 2014లో విడుదలైన ఈ చిత్రంలో ధనుష్ సిగరెట్లు కాల్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని టుబాకో నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దాంతో ఆరోగ్యశాఖ సహాయక నిర్వాహకులు చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు సరైన ఆధారాలు లేవని పిటిషన్ కొట్టివేసింది.