రాజ్ మరియు డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి మరియు రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన 'ఫర్జీ' వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుండి ఏకగ్రీవ ఆదరణ పొందింది మరియు ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా ఇప్పుడు 2023లో IMDb యొక్క గ్లోబల్ టాప్-రేటెడ్ సిరీస్‌లో 2వ ర్యాంక్‌ని పొందినందున ఈ సిరీస్ గ్లోబల్ స్థాయిలో దాని ఆధిపత్యాన్ని వర్ణించింది. ఈ ఎలైట్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయ వెబ్ సిరీస్ గా ఫర్జీ నిలిచింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్‌లో కే కే మీనన్, భువన్ అరోరా, జాకీర్ హుస్సేన్, చిత్తరంజన్ గిరి, అమోల్ పాలేకర్, రెజీనా కసాండ్రా మరియు కావ్యా థాపర్ కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa