అమ్మాయిల విషయంలో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ వివాదంలో చిక్కుకుంటూ ఉన్నారు. తాజాగా సింగర్ జోనితా గాంధీతో అనిరుధ్ ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీస్ట్ సినిమాలో జోనితా ‘అరబిక్ కుత్తు’ పాట పాడి ఫేమస్ అయింది. అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అనిరుధ్ ఎక్కడ ఉంటే జోనితా అక్కడ కనిపిస్తోంది. దాంతో వీరు లవ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.