కాంతార సినిమాతో డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో కాంతారా-2 కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా కాంతారా-2పై రిషబ్ శెట్టి కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, లొకేషన్ సెర్చ్‌తోపాటు ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోందన్నారు. షూటింగ్ అప్‌డేట్ హోంబాలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందన్నారు. ఈ ఏడాది చిత్రీకరణ పూర్తి చేసి 2024లో సినిమా విడుదల చేస్తామన్నారు.