టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా చివర దశకు చేరుకుంది. 2-3 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత ఏడాది పాటు ఆమె విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ సమంత.. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని వరుస సినిమాలు చేశారు. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa