సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీకి అధికారికంగా 'BRO' అనే పేరు పెట్టారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, బ్రో టీజర్ యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టిస్తుంది.
ఈ ఫాంటసీ కామెడీ డ్రామాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తోంది. ఈ బిగ్గీ జూలై 28, 2023న ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపైకి రానుంది. ఈ సినిమాలో కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి మరియు రాజా చెంబోలు కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ సితం యొక్క అధికారిక రీమేక్. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa