ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీ-రిలీజ్ లో సెన్సషనల్ ని సృష్టిస్తున్న 'ఈ నగరానికి ఏమైంది'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 05:29 PM

టాలీవుడ్‌ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమతం మరియు వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా యువ ప్రేక్షకులలో కల్ట్ స్టేటస్‌ని పొందింది. మూవీ మేకర్స్ ఈ సూపర్‌హిట్ మూవీ యొక్క 5వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 29, 2023న థియేటర్‌లలో తెలుగు రాష్ట్రాల్లోని 200 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసారు.


అనుకున్నట్టుగానే ఈ నగరానికి ఏమైంది సినిమా మొత్తం మీద సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో రీరిలీజ్ అయింది. ఈ చిత్రం 2018లో మొదటి రోజు ఫస్ట్ షోల నుండి దాదాపు 20 లక్షలు వసూలు చేయగా, రీ-రిలీజ్ అయిన తర్వాత అన్ని అంచనాలను మించి  80 లక్షలు వసూలు చేసింది. ఇంత అద్భుతమైన స్పందన వచ్చినందుకు మూవీ మేకర్స్ స్పెషల్ షోలను జూలై 2 వరకు పొడిగించాలని నిర్ణయించుకున్నారు.

ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ బడ్డీ కామెడీ చిత్రంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అతిధి పాత్రలో కనిపించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa