పి వాసు దర్శకత్వంలో స్టార్ కొరియోగ్రాఫర్-నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందరూ అత్యంత ఎదురుచూస్తున్న ఈ హారర్ డ్రామా సెప్టెంబర్‌లో రాబోయే వినాయక చతుర్థి పండుగ సీజన్‌లో విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ పాన్-ఇండియన్ మూవీ యొక్క విడుదల తేదీని రానున్న రోజుల్లో మూవీ మాకర్స్ ప్రకటించనున్నారు.
ఈ చిత్రంలో హిందీ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీత దర్శకుడు, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. చంద్రముఖి ఫ్రాంచైజీలో చంద్రముఖి 2 ఒక భాగం. చంద్రముఖి 1లో సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలు పోషించారు. 2005లో విడుదలైన ఈ చిత్రం తమిళం మరియు తెలుగు భాషల్లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa