పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జులై 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధం అవుతోంది. తాజాగా బ్రో సినిమా టీజర్ విడుదలకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. గురువారం సాయంత్రం 5:04 గంటలకు బ్రో టీజర్ విడుదల చేయనున్నారు.