‘మా’ సభ్యత్వంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ‘మా’ అసోసియేషన్ కేవలం తెలుగు నటీనటులకు మాత్రమే పరిమితం అయింది. ఇందులో సభ్యత్వం ఉన్నవారికే బెనిఫిట్స్ అందేవి. తాజాగా ‘మా’ సభ్యత్వంలో కొన్ని సవరణలు చేశారు. తెలుగు చిత్రాలలో నటించే బాలీవుడ్ వారికి కూడా సభ్యత్వం లభించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మా అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి బాలాజీ ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు.