అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ.. తన భర్త దినేష్ కార్తీక్ ఫోన్‌లో బెదిరిస్తున్నాడని బుల్లితెర నటి రచిత మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటి రచిత, దినేష్ కార్తీక్ ‘పిరివం సంతిప్పమ్’ అనే సీరియల్‌లో జంటగా నటించారు. ప్రేమలో పడ్డ వీరు 2013లో వివాహం చేసుకున్నారు. కొంతకాలం క్రితం వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్త అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని నటి రచిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.