అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’గా వస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే టైటిల్, ఆ తర్వాత టీజర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. అయితే తాజాగా ఇవాళ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో చీర కట్టులో కాజల్ అగర్వాల్ చాలా హోమ్లీగా కనిపిస్తోంది.