తెలుగు తెర అందాల చందమామ కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఆమె వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో బాలకృష్ణతో `భగవంత్ కేసరి` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. బాలయ్యకి జోడీగా చేస్తుంది. మరోవైపు తమిళంలో `ఇండియన్ 2`లో నటిస్తుంది. తాజాగా మరో కొత్త సినిమాకి సైన్ చేసింది. అంతేకాదు ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందని సమాచారం.
`కాజల్60` పేరుతో తాజాగా కొత్త సినిమాని ప్రకటించారు. ఔరుమ్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రీ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో రాత్రి వేళ కాజల్ కారులో డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంది. మిర్రర్‌లో కొద్దిగా ఆమెని చూపించారు. బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తుంది. ఒక చేతిని డోర్ బయటపెట్టింది. చేతికి గాజులున్నాయి. ఈ లుక్‌లో చూస్తుంటే కాజల్ బోల్డ్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ ని రేపు(జూన్ 18న)న విడుదల చేయబోతున్నారు.
#Kajal60 Title and glimpse tomorrow
Can't wait to show this to you all @AurumArtsOffl pic.twitter.com/fG1pZN5Yhs
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 17, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa