హాలీవుడ్ స్టార్ నటుడు ఆల్ పాసినో 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి అయ్యాడు. తన ప్రేయసి నూర్ అల్ఫాల్లా (29 ఏళ్లు) పండంటి మగబిడ్డను జన్మనిచ్చింది. తన కుమారుడికి ‘రోమన్ పాసినో’ అని నామకరణం చేసినట్లు ఆల్ పాసినో-నూర్ అల్ఫాల్లా వెల్లడించారు. కాగా, ఆల్ పాసినో, నూర్‌కు కరోనా సమయంలో పరిచయం ఏర్పడింది. 2022 ఏప్రిల్ నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ‘ది గాడ్ ఫాదర్’ అనే సిరీస్‌లో ఆల్ పాసినో నటించారు.