సినీతార నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారాయి. చాలా మంది హీరోయిన్ లు పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైనా చేదు అనుభవాలను చెబుతుంటారు. తాజాగా నిత్యామీనన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. లైంగికంగా వేధించే వారు అన్నిరంగాల్లో వుంటారని, టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను అలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని. కానీ తమిళంలో మాత్రం ఓషూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కున్నాను. ఓహీరో నన్ను బాగా వేధించాడని ఆమె చెప్పుకొచ్చింది. నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ చాలా నీచంగా ప్రవర్తించాడని తెలిపింది.