నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాలయ్య 108 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై తాజాగా సాలిడ్ అప్డేట్‌ని మేకర్స్ అందించారు. ఈ జూన్‌లో బాలయ్య బర్త్ డే కానుకగా అదిరే ట్రీట్‌లు రెడీగా ఉన్నాయని ప్రకటించారు. ‘అన్న దిగుతుండు’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా విడుదలౌతుంది.