Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now
అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం
అందమైన భావం.. అందులో నువు మొదటి అక్షరం
అందుకేగ నీతో ..సాగుతోంది చిన్ని పాదం
ఓ చెలీ అనార్కలీ.. నీ నవ్వులే దీపావళీ
పేరుకే నేనున్నదీ.. నా ఊపిరే నువ్వేమరీ
చందమామనెవ్వరైన పట్టపగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా
అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం
Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now
ఓర చూపుకి లొంగిపోవడం
దొరా నవ్వుకే పొంగిపోవడం
ప్రేమలోనే నేర్చుకున్నా రాతిరంతా మేలుకోవడం
నిన్ను నాలో దాచుకోవడం.. నన్ను నీలో చూసుకోవడం
నమ్మలేక నన్నునేనే అప్పుడప్పుడు గిల్లుకోవడం
ఓ చెలీ అనార్కలీ.. బాగున్నదీ హడావిడీ
నేనిలా వినాలనే.. ఇన్నాళ్లనుంచి కలలుకన్నదీ
అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం
పూటపూటకొ పండగవ్వడం.. మాటిమాటికి నవ్వుకోవడం
ప్రేమలోన తేలుతుంటే కష్టమేలే తట్టుకోవడం
దిండునేమో హత్తుకోవడం.. జుట్టురింగులు తిప్పుకోవడం
ప్రేమపిచ్చే రేగుతుంటే తప్పదేమో దారితప్పడం
ఓ చెలీ అనార్కలీ.. తమాషగుందిలే ఇదీ
అందుకే సరాసరీ.. మనస్సు ఇచ్చిపుచ్చుకున్నదీ
అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం
Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa