మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.SSMB28 వర్కింగ్ టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఘట్టమనేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన మహేష్ బాబు ప్రీలుక్ చూస్తుంటే దర్శకుడు త్రివిక్రమ్ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు అర్థం అవుతుంది. ఇక, ఇవాళ నటశేఖర్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని టైటిల్, పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.
కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. మోసగాళ్లకు మోసగాడు థియేటర్స్ లో మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ ప్రీ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు తలకు గుడ్డ కట్టుకొని..విలన్స్ పై ఫైట్ కు రెడీ అవుతున్నట్లుగా పోస్టర్ లో ఉంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ..ఈ రోజు చాలా స్పెషల్..ఇది మీ కోసమే నాన్న అంటూ మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు.SSMB28 మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటులు జగపతిబాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
Today is all the more special! This one's for you Nanna pic.twitter.com/HEs9CpeWvY
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa