టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకులని అలరించడానికి రాబోతున్నాడు. శరణ్ కొప్పిశెట్టితో తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమాకి 'ఫుల్ బాటిల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.
తాజాగా ఫుల్ బాటిల్ టీజర్‌ని ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌స్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో సత్యదేవ్ మెర్క్యురీ సూరి పాత్రలో నటిస్తుండగా, బ్రహ్మాజీ, హర్ష చెముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. SD కంపెనీ అండ్ సర్వంత్ రామ్ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa