సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే విడుదలకు ఒకరోజు ముందు ఈ సినిమా విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఆ సినిమాలోని సన్నివేశాలు తన ప్రతిష్టను కించిపరిచేలా ఉన్నాయంటూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa