ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మేమ్ ఫేమస్'

cinema |  Suryaa Desk  | Published : Mon, May 22, 2023, 06:06 PM

రైటర్ పద్మభూషణ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత లహరి ఫిల్మ్స్ మరియు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి 'మేమ్ ఫేమస్' అనే ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.


తాజాగా ఇప్పుడు ప్రమోషన్స్‌తో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని CBFC నుండి U/A సర్టిఫికేట్‌ ని పొందినట్లు సమాచారం. ఈ విలేజ్ ఫన్ డ్రామా మే 26, 2023న థియేటర్లలో విడుదల కానుంది.


మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సారయ, మరియు సిరి రాసి ఇతరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa