టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన భారతదేశపు మొట్టమొదటి కౌబాయ్ చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' మే 31న గ్రాండ్ రీ-రిలీజ్ కానున్న సంగతి అందరికి తెలిసిందే. లెజెండరీ నటుడి జన్మదినోత్సవం సందర్భంగా ఈ సినిమా 4కె రిజల్యూషన్‌లో విడుదల కానుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మోసగాళ్లకు మోసగాడు రీ-రిలీజ్ ట్రైలర్‌ను కృష్ణ చిన్న కొడుకు మరియు ప్రముఖ హీరో మహేష్ బాబు ఈరోజు సాయంత్రం ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. తమ అభిమాన సీనియర్ హీరో ఐకానిక్ సినిమా రీ-రిలీజ్ కావడంతో అభిమానులు ఇప్పటికే థ్రిల్‌లో ఉండగా, మహేష్ ఈ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేయడం విశేషం అని చెప్పొచ్చు.
మోసగాళ్లకు మోసగాడు సినిమా 1971లో విడుదలైంది. KSR దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, విజయ నిర్మల మరియు నాగభూషణం ప్రముఖ పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో శ్రీ పద్మాలయ ఫిలిమ్స్ పతాకంపై జి. ఆదిశేషగిరిరావు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa