ఇటీవల విడుదలైన బిచ్చగాడు-2 మూవీ తెలుగులో సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. బిచ్చగాడు, బిచ్చగాడు-2 కూడా సక్సెస్ కావడంతో ఈ సిరీస్‌ను కొనసాగించాలని విజయ్ ఆంటోనీ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బిచ్చగాడు-3ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. బిచ్చగాడు-3 షూటింగ్‌ను 2025లో మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. ఇక ఈ మూడో పార్ట్‌కు తానే దర్శకత్వం వహించబోతున్నట్లు విజయ్ ఆంటోనీ పేర్కొన్నారు.