ప్రముఖ హాస్య నటుడు సుధాకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారని, పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలుస్తోంది. కాగా, సుధాకర్ ఆరోగ్యం గురించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. ఆయన ఇది వరకు ఓసారి కోమాలోకి కూడా వెళ్లొచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన అనారోగ్యం వార్తలపై కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది.