మా సభ్యురాలు, సినీ నటి కరాటే కళ్యాణికి ’మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ (MAA)’ అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులిచ్చి 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను నిలిపేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయాధ్యక్షురాలిగా ఆమె పేర్కొన్నారు. దేవుడి రూపంలో రాజకీయ వ్యక్తిని ఆరాధిస్తే తమ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa