‘ద కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, ఈ నెల 5న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది. అయితే మూడో తేదీనే విడుదలను నిలిపేయాలంటూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. కేరళ నుంచి 32 వేల మంది యువతులను ఐసిస్‌లోకి చేరేలా వారి ముస్లిం స్నేహితులు ప్రలోభపెట్టారని సినిమాలో చూపిస్తూ విద్వేశాన్ని రెచ్చగొడుతున్నారని పిటిషనర్లు ఆక్షేపించారు.