చాలా రోజులు తరువాత పూరి జగన్నాధ్ రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు.అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో చేసిన 'లైగర్' సినిమా ప్లాప్ అయింది. దీంతో ఏ స్టార్ హీరోలు పూరీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అందుకే మళ్లీ రామ్ తో పూరి సినిమా ఫిక్స్ చేశాడు. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాకి 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ఖరారు చేసారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa