"ఉప్పెన" సినిమాతో హీరో గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తాజగా ఇప్పుడు తన 4వ ప్రాజెక్ట్ ని ఇటీవలే నూతన దర్శకుడు శ్రీకాంత్‌తో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి టెంపరరీ గా 'PVT04' అనే టైటిల్ ని పెట్టారు. తాజాగా ఈరోజు చిత్ర నిర్మాతలు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా యొక్క వీడియో గ్లింప్సె ని మే 15వ తేదీ సోమవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ చిత్రంలో ధమాకా ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డడ్లీ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ సినిమాలో జోజు జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa