ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐకానిక్ ప్లేస్‌లో లాంచ్ కి సిద్ధంగా ఉన్న నిఖిల్ 'స్పై' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 12, 2023, 07:16 PM

ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ స్పై టీజర్ మే 15, 2023న ఐకానిక్ ల్యాండ్‌మార్క్ కర్తవ్య పాత్ (రాజ్ పాత్) వద్ద విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఎడ్ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa