టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం తన రాబోయే పాన్-ఇండియన్ మూవీ 'స్పై' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 29, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, రావణాసుర చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ చెప్పిన స్క్రిప్ట్‌కు నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఈ నెలలో లాంచ్ కానుంది.
ఈ చిత్రంలో నిఖిల్‌కి జోడీగా మైఖేల్ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ జోడిగా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa