రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'రూల్స్ రంజన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా ఇప్పుడు, నాలో నేనే లేను అనే మెలోడీ పేరుతో ఈ సినిమాలోని తొలి సింగిల్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం 05:30 గంటలకు ఈ పాట ప్రోమోను విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దివ్యాంగ్ లావానియా మరియు వి మురళీ కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa