టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'కస్టడీ' అనే టైటిల్ ని పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 21.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడిగా కనిపించనుంది. ఈ కాప్ డ్రామా మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి, నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎవర్ హ్యాండ్సమ్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు.
ఈ తెలుగు-తమిళ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు, మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తోంది.
'కస్టడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::::::
నైజాం - 7.50 కోట్లు
సీడెడ్ - 2.20 కోట్లు
ఆంధ్రప్రదేశ్ - 8.50 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ : 18.20 కోట్లు
KA + ROI - 1.2 కోట్లు
OS - 2.4 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 21.80 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa