దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'సీతారామం'. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాకి అరుదైన అవార్డు దక్కింది. ఇది 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ విభాగంలో బెస్ట్ మూవీ అవార్డును గెలుచుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హను రాఘవపూడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa