ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భోలా శంకర్' నుండి చిరంజీవి లుక్‌ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 06:26 PM

మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈరోజు లేబర్ డే (మే డే) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పాతకాలపు మాస్ లుక్‌లో కనిపిస్తున్న మూడు కొత్త పోస్టర్‌లను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లలో మెగా హీరో గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నాడు.


ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ వేదాళం యొక్క అధికారిక తెలుగు రీమేక్. ఈ సినిమా 2023 ఆగస్టు 11న థియేటర్లలో విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మెగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్, కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa