ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉగ్రం' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్స్ గా నలుగురు టాలీవుడ్ హీరోస్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 04:14 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్  తన తదుపరి ప్రాజెక్ట్ ని దర్శకుడు విజయ్ కనకమేడలతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'ఉగ్రం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది.


తాజా సమాచారం ప్రకారం, అడివి శేష్, సందీప్ కిషన్, విశ్వక్సేన్ మరియు నిఖిల్ సిద్ధార్థ ఈ ఈవెంట్‌కు  ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. ఈ సినిమా మే 5, 2023న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa