సినీ నటి సంయుక్త మరోసారి మానవత్వం చాటుకున్నారు. ‘విరూపాక్ష’ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొంది. సాయిధరమ్ తేజ్-సోనియాసింగ్, సంయుక్త-రవికృష్ణ బృందాలుగా పాల్గొనగా, సంయుక్త-రవికృష్ణ టీమ్ స్కూటీని గెలుపొందింది. సాయిధరమ్ తేజ్ మాట ప్రకారం సింగిల్ ఫేరెంట్ ఉన్న వారికి తాను గెలుచుకున్న బైక్‌ను ఒకరికి ఇచ్చేశారు. మరొకరికి కొత్త స్కూటీ తానే స్వయంగా కొనిస్తానని మాటిచ్చారు.