టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వివాహ భోజనంబు ఫేమ్ దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి ఒక చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'సమాజవరగమన' అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క టీజర్‌ను విడుదల చేశారు.
బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి కెమెరా క్రాంక్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa