ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రెండు రోజులలో 'వేద్' OTT ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 04:12 PM

రితీష్ దేశ్‌ముఖ్ మరియు జెనీలియా నటించిన మరాఠీ బ్లాక్‌బస్టర్ 'వేద్' చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. రితీష్ దేశ్‌ముఖ్ తొలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన మజిలీ మూవీకి రీమేక్ అయిన ఈ మరాఠీ చిత్రం మరాఠీతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందని OTT ప్లాట్‌ఫారమ్ ప్రకటించింది. ఈ సినిమాలో జియా శంకర్, అశోక్ సరాఫ్, విద్యాధర్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa