టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టతో కలిసి పని చేస్తున్నట్లు కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడి నుంచి కానీ, నటుడి నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఇప్పుడు UV క్రియేషన్స్ సోషియో-ఫాంటసీ చిత్రంగా చెప్పబడుతున్న ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. మెగాస్టార్ ప్రస్తుతం యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ భోళాశంకర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. చిరంజీవి 156వ చిత్రానికి సర్దార్ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa