ప్రముఖ చలనచిత్ర డేటాబేస్ సైట్ IMDb ఈ వేసవిలో పెద్ద స్క్రీన్‌పై చూడటానికి భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ ని విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 10 సినిమాలు ఉండగా మరియు వాటిలో నాలుగు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినవి.
ఈ లిస్ట్ లో ప్రభాస్ పౌరాణిక నాటకం ఆదిపురుష్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఛత్రపతి, తేజ సజ్జ యొక్క హనుమాన్, నాగచైతన్య కస్టడీ వరుసగా 3, 5, 9, 10 స్థానాల్లో నిలిచాయి. అట్లీ దర్శకత్వం వహించిన షారుఖ్ ఖాన్ యొక్క జవాన్ ఈ చార్టులలో అగ్రస్థానంలో ఉంది. తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన రణబీర్ కపూర్ యొక్క యానిమల్. గదర్ 2, మైదాన్, యోధా మరియు రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ కూడా ఈ లిస్ట్ లో చోటు సొంతం చేసుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa