ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్‌టైమ్ ని లాక్ చేసిన ప్రభాస్ 'ఆదిపురుష్'?

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 22, 2023, 05:11 PM

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ బిగ్గీ 174 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్‌ను కలిగి ఉందని సమాచారం. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం 16 జూన్ 2023న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి అజయ్-అతుల్ సంగీతం అందించారు. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa