రామ్‌చరణ్ సతీమణి ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో చిరంజీవి నివాసంలో ఉపాసనకు బేబీ షవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని చిరు ఇంట బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ఉపాసనకు ఆమె సోదరీమణులు అనుష్పాల, సింధూరి దుబాయ్‌లో సీమంతం చేశారు. అయితే వైద్యులు జులైలో డెలివరీ డేట్ ఇచ్చినట్లు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa