ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయిక. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరమ్ చిత్రానికి ఈ సినిమా అధికారక రీమేక్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం 144 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ యాక్షన్ కామెడీ మూవీలో టాలీవుడ్ నటులు విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, భూమిక చావ్లా మరియు రామ్ చరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా, రవి బస్రూర్, సుఖ్బీర్ సింగ్, దేవి శ్రీ ప్రసాద్, సాజిద్ ఖాన్, పాయల్ దేవ్ మరియు అమల్ మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa