ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎన్టీఆర్ 30' సెట్స్ లో జాయిన్ అయ్యిన జాన్వీ కపూర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 18, 2023, 03:42 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లో పూర్తయింది.


తాజా సమాచారం ప్రకారం, ఈ పాన్-ఇండియన్ సినిమా యొక్క రెండవ షెడ్యూల్ గత రాత్రి ప్రారంభమైంది. జాన్వీ కపూర్ ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. ఈ తాజా షెడ్యూల్‌లో ఎక్కువ భాగం షూటింగ్ రాత్రిపూట జరుగుతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.


సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa