ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క తదుపరి చిత్రాన్ని USAలో విడుదల చేయనున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 17, 2023, 05:13 PM

మహేష్ బాబు దర్శకత్వంలో బ్యూటీ క్వీన్ అనుష్క శెట్టి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల హక్కులను ఇటీవల నాని దసరా సినిమాని  అమెరికాలో విడుదల చేసిన ప్రత్యంగిర సినిమాస్ సొంతం చేసుకున్నట్లు తాజా సమాచారం. ఈ విషయం గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి వెలువడనుంది. ప్రముఖ బ్యానర్ UV క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa