కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా 'ఘోస్టీ' మార్చి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యి బాక్స్ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ హారర్-కామెడీ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ZEE5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ ZEE5లో తమిళ భాషలో ఆంగ్ల ఉపశీర్షికలతో ప్రసారం అవుతోంది.
ఈ చిత్రంలో ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు, రాధికా శరత్‌కుమార్, కెఎస్ రవికుమార్ మరియు ఊర్వసి కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సీడ్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa