ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకీ అట్లూరి తదుపరి సినిమాలో మలయాళ స్టార్ హీరో?

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 04:56 PM

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవలే ధనుష్ నటించిన వాతి/సర్ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. వెంకీ అట్లూరి కొన్ని ప్లాప్ సినిమాల తర్వాత ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంతో మంచి కామ్ బ్యాక్ ఇచ్చాడు. తాజాగా ఈ యువ దర్శకుడు పెళ్లి కూడా చేసుకున్నాడు. తాజాగా ఇప్పుడు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తో చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సర్ సినిమాని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని కూడా రూమర్ వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa