టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'అల వైకుంఠపురములో' సినిమాని బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ 'షెహజాదా' అనే టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 17, 2023న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని నిరాశపరించింది.
తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబటులోకి రానుంది అని సమాచారం. ఇదే విషయాన్ని స్ట్రీమింగ్ సర్వీస్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి సనన్ కార్తీక్ ఆర్యన్‌కి జోడిగా నటించింది.
ఈ సినిమాలో పరేష్ రావల్, మనీషా కొయిరాలా, సచిన్ ఖేడేకర్ మరియు రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ప్రీతమ్ సంగీతం అందించాడు. టి-సిరీస్ ఫిల్మ్స్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాట్ ఫిల్మ్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa